మీమ్ పేజీల‌పై రేణు దేశాయ్ ఫైర్

మీమ్ పేజీల‌పై రేణు దేశాయ్ ఫైర్

Published on Jun 25, 2024 9:30 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క‌నిపిస్తారు. అయితే, ఆమెకు ప‌వన్ అభిమానులు, మీమ్ పేజీల నుంచి నిత్యం వేల సంఖ్య‌లో మెసేజ్ లు వ‌స్తుండ‌టంతో, ఆమె వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఓ ఫోటోపై కొన్ని మీమ్ పేజీలు చేసిన కామెంట్ ఆమెకు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించాయి.

కొంత కాలం క్రిందట త‌న మాజీ భ‌ర్త, పిల్లలు క‌లిసి ఉన్న ఫోటోల‌ను రేణు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, తాజాగా ప‌వన్ ప‌క్క‌న అన్నా లెజ్నోవా కూడా ఉన్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో, ఈ ఫోటోను రేణు ఎలా క్రాప్ చేస్తుందో అంటూ కొంద‌రు కామెంట్ చేశారు. దీంతో వారిపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.

తన కూతురు నేడు చాలా ఏడ్చింద‌ని.. ఓ మీమ్ పేజీలో త‌న త‌ల్లి గురించి వ‌చ్చిన మీమ్ ను ఆమె జీర్ణించుకోలేక‌పోయింద‌ని.. సెల‌బ్రిటీలు, పొలిటీషియ‌న్ల కుటుంబ‌స‌భ్యుల‌పై ఇలాంటి కామెడీ చేస్తారా.. మీకు కూడా త‌ల్లులు, చెల్లెలు, కూతుళ్లు ఉన్నారుగా.. నా కూతురు పడ్డ బాధ‌, ఆమె క‌న్నీళ్లు మీమ్ పేజెస్ వారికి అన‌ర్థాల‌ను తీసుకొస్తాయి.. ఒక త‌ల్లిగా నా శాపం త‌గులుతుంది.. ఈ పోస్ట్ పెట్టేందుకు 100 సార్లు ఆలోచించాను.. కానీ నా కూతురి బాధ మీ అంద‌రికీ తెలియాల‌ని ఇది పెడుతున్నా.. అంటూ రేణు కామెంట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు