నన్ను టార్చర్ చేయకండి – రేణూ దేశాయ్

నన్ను టార్చర్ చేయకండి – రేణూ దేశాయ్

Published on Jun 16, 2024 4:22 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ అభినందనలు కూడా తెలిపారు. ఐతే, రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి వరుస మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో ఆమె తనను టార్చర్ చేయడం ఆపాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగింది అంటే.. సోషల్ మీడియాలో పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

‘వదినగారూ దేవుడిని పెళ్లి చేసుకుని, ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది’ అని ఆ పోస్ట్ సారాంశం. కాగా ఈ కామెంట్ ను చూసిన రేణూ దేశాయ్ అసహనం వ్యక్తం చేస్తూ ‘పవన్‌ ను నేను వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చి.. ఇక తనను టార్చర్ చేయకండి అంటూ మెసేజ్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు