ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ‘రేణిగుంట’ సినిమాలో తన వాయిస్ ను వినిపించనున్నారు. గతంలో ఆయన తన గాత్రాన్ని ‘కందిరీగ’ సినిమాలో సోనూ సూద్ పరిచయ సమయంలో వినిపించారు. అంతేకాక ‘శంబో శివ శంబో’ చిత్రం లోనూ ఆయన తన వాయిస్ వినిపించారు.
ఈమధ్య కాలంలో ప్రముఖ నటులు, దర్శకులు తమ గాత్రాన్ని వివిధ సినిమాల్లో వినిపిస్తున్నారు. ఇటీవలే రవిబాబు దర్సకత్వం లో విడుదలైన ‘నువ్విలా’ చిత్రంలో నటుడు సునీల్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఆయన ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేసారు. అలానే గతేడాది రవితేజ తన వాయిస్ ను రాజమౌళి ‘మర్యాద రామన్న’ చిత్రానికి వాయిస్ అందించారు.
‘రేణిగుంట’ సినిమాలో వివి వినాయక్ కంట్రిబ్యూషన్ గురించి ఆ చిత్ర నిర్మాత సురేష్ కొండేటి ఇలా చెబుతున్నారు. “ఆయన తొలుత మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’ చిత్రంలో తెరపై కనిపించరు, అందులో అతని డైలాగ్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. అనంతరం ఆయన ‘శంభో శివ శంబో’ చిత్రానికి వాయిస్ అందించారు ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తాజాగా తన చిత్రం ‘రేణిగుంట’ కు వినాయక్ వాయిస్ అందించేందుకు ఒప్పుకోవటం తనకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది”. అంటున్నారు. సురేష్ కొండేటి.