అలరిస్తున్న “మిస్టర్ బచ్చన్” నుండి రెప్పల్ డప్పుల్ సాంగ్!

అలరిస్తున్న “మిస్టర్ బచ్చన్” నుండి రెప్పల్ డప్పుల్ సాంగ్!

Published on Jul 25, 2024 6:17 PM IST


టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ అయిన రెప్పల్ డప్పుల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ ఎనర్జిటిక్ గా ఆడియెన్స్ ను అలరిస్తుంది. మాస్ మహారాజ డాన్స్ మరోసారి అదరగొట్టారు. థియేటర్ల లో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చే సాంగ్ అని చెప్పాలి. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు