కెరీర్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్న తెలుగమ్మాయి రేష్మ రాథోర్

Reshma
‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్. ఇటీవలే తను ‘ప్రతిఘటన’లో చేసిన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో కెరీర్లో ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన రేష్మ రాథోర్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. రేష్మ రాథోర్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఆఫర్స్ దక్కించుకుంటోంది.

రేష్మ రాథోర్ ప్రస్తుతం తెలుగులో 4 సినిమాలకి సైన్ చేసింది. అందులో ఒక్క రామానాయుడు గారి సినిమా తప్ప మిగతా అన్నీ సెట్స్ పై ఉన్నాయి. చందమామ కథలు ఫేం అభిజీత్ తో చేస్తున్న ‘జీలకర్ర బెల్లం’, ప్రిన్స్ తో చేస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ మరియు వరుణ్ సందేశ్ తో చేస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవి కాకుండా తమిళంలో చేస్తున్న రెండు సినిమాలు కుడా సెట్స్ పై ఉన్నాయి. అలాగే హిందీలో చేయనున్న సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ రోజు రేష్మ రాథోర్ పుట్టిన రోజు. ‘ఇన్ని రోజులు స్టడీస్ తో కొద్దిగా స్లోగా సినిమాలు చేసాను. ఇప్పుడు నా చదువుపూర్తయ్యింది. ఇక కంటిన్యూగా సినిమాలు చేస్తానని’ రేష్మ రాథోర్ తెలిపింది. ఈ బర్త్ డే బ్యూటీకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

Exit mobile version