వైరల్ అవుతున్న ఎస్ పి బాలు గారి ఎమోషనల్ స్పీచ్.!

వైరల్ అవుతున్న ఎస్ పి బాలు గారి ఎమోషనల్ స్పీచ్.!

Published on Sep 26, 2020 1:04 PM IST

లెజెండరీ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తుది శ్వాసతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక మరపురాని అధ్యాయం ముగిసింది. అయితే ఇప్పుడు ఆయన జ్ఞ్యాపకాలతోనే అంతా గడుపుతున్నారు. అలాంటి ఒక అద్భుతమైన జ్ఞ్యాపకంలా మిగిలిపోయిన వీడియోనే ఒకటి వైరల్ అవుతుంది. అదే తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానెల్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్.

అతిరథ మహారథులతో పాటుగా మరో ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆ సమయంలో ఆయనకు మరియు ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావు గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపారు. రామోజీరావు గారు ఒకసారి స్నేహితుని కోసం ఒక సలహా చెప్పారని, “ఒకసారి ఎవరినైనా స్నేహితునిగా చేసుకునే ముందు చాలా సార్లు ఆలోచించాలని ఒక్కసారి స్నేహం కుదిరాక వారిలో తప్పులు కనిపిస్తే వీలయితే ఆ తప్పులను సరిదిద్దండి లేదా ఆ జన్మాంతం భరించండి” అని తెలిపారు.

అలాగే అందరికంటే కూడా రామోజీరావు గారికి తనకు ఎక్కువ అనుబంధం ఉందని భావిస్తానని ఎందుకంటే ఈటీవీ ఛానెల్ టైటిల్ లోగోను లాంచ్ చేసిన పాట దగ్గర నుంచి ఆయన ఛానెల్లో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సినిమాలు తనకు అపారమైన పేరు తీసుకొచ్చిన “మయూరి” చిత్రానికి సంగీత దర్శకునిగా ఎంతో మంది ఉన్నప్పటికీ నాకు అప్పగించారని అంతే కాకుండా నేను చెయ్యను అన్నప్పటికీ పట్టు పట్టి “పాడుతా తీయగా” లాంటి ఒక అద్బుతమైన స్టేజ్ ను నాకు అందించారని వ్యాఖ్యానించారు.

అలాగే వారిద్దరి నడుమ జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం కోసం కూడా ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా రామోజీరావు గారి ఆస్థాన వ్యక్తిగా ఎప్పుడూ కారును పంపేవారని అలా ఒక నాడు ఆయన ఇంటికి ఫోన్ చెయ్యగా ఆయన ఫోన్ ఎత్తారని మీరు ఎత్తరేంటి అని అడగ్గా ఏం నాతో ఐతే మాట్లాడారా అని అన్నారని తెలిపారు. అపుడు తాను ఇలా వస్తున్నాను డ్రైవర్ ను పంపిస్తారేమో అని భయం గానే అడగ్గా రామోజీరావు గారు ఆదివారం డ్రైవర్లు ఎవరూ ఉండరు..

కానీ ఒకడున్నాడు కారు నడిపి చాలా ఏళ్ళు అయ్యి ఉంటుంది అతను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడని అన్నారు, దానికి అతను ఎవరు అని అడగ్గా అది నేనే అని రామోజీరావు గారు అన్నారని ఆ మధుర జ్ఞ్యాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఆయన ఇచ్చిన “పాడుతా తీయగా” ద్వారా ఎంతోమంది నాకు అభినందనలు తెలిపారని నా ఇంటి పేరు కూడా మారిపోయే స్థాయి షో తనకు ఇవ్వడం మూలాన తాను ఎంతో నేర్చుకున్నాను, అదంతా నావల్ల అనుకుంటారు కానీ ఇదంతా రామోజీరావు గారి వలనే అని అందుకు నేనేమి ఇవ్వగలను అని కాదనకుండా సభా ముఖంగా రామోజీరావు గారి పాదాలకు నమస్కరించి కృతజ్ఞ్యతలు తెలిపారు. ఇపుడు ఈ ఎమోషనల్ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు