సమీక్ష : రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్!

Return of the Dragon Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు :ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్
దర్శకుడు :: అశ్వత్‌ మారిముత్తు
నిర్మాణం : కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌
సంగీతం :లియోన్‌ జేమ్స్‌
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి

ఎడిటర్ :ప్రదీప్ ఈ రాఘవ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ‘ఓరి దేవుడా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

కథ :

డి.రాఘవన్(ప్రదీప్ రంగనాధన్) ఇంటర్మీడియట్లో మంచి స్టూడెంట్. పైగా 96%తో పాస్ అయ్యి, మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటాడు. ఐతే, ఓ అమ్మాయి కారణంగా తాను బ్యాడ్ బాయ్ గా మారతాడు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ లో ఏకంగా 48 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతాడు. మరోవైపు అదే కాలేజీలో కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. కాలేజీ అనంతరం కీర్తి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని డి.రాఘవన్ లైఫ్ లో సక్సెస్ అవుతాడు. పల్లవి (కాయాదు)తో పెళ్ళి కూడా సెట్ అవుతుంది. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన కారణంగా
రాఘవన్ లైఫ్ లోకి అతని కాలేజ్ ప్రిన్సిపాల్ వస్తాడు. అసలు కాలేజ్ ప్రిన్సిపాల్ ఎందుకు రాఘవన్ దగ్గరకు వచ్చాడు ?, రాఘవన్ కి తగిలిన ఊహించని షాక్ ఏమిటి ?, ఇంతకీ, పల్లవితో రాఘవన్ పెళ్లి జరిగిందా? లేదా ?, మళ్ళీ రాఘవన్ లైఫ్ లోకి వచ్చిన కీర్తి ఏం చేసింది?, చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

లవ్ టుడే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. నేటి సమాజంలో యువత జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ఫేక్ చేస్తూ జాబ్ లు తెచ్చుకునే అంశాన్ని చాలా బాగా చెప్పారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు యూత్ ఫుల్ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి హీరో ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.

ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ పాత్ర, అతని తండ్రి పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన ప్రదీప్ రంగనాథన్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘ప్రదీప్ రంగనాథన్’ తన పాత్రను చాలా బాగా పండించారు. అతని తండ్రి పాత్రలో జార్జ్ మేరియన్ జీవించారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంది.

మరో హీరోయిన్ గా కనిపించిన కయాదు లోహర్ చాలా గ్లామర్ గా కనిపించింది. ఆమె నటన కూడా బాగుంది. అదేవిధంగా మిస్కిన్ పాత్రతో పాటు ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి. ఐటీ కంపెనీ హెడ్ గా గౌతమ్ మీనన్ నటన బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షిత్ కన్నా మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

డ్రాగన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. పైగా కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో సక్సెస్ అయ్యే క్రమంలో వచ్చే సీన్స్ ను ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

ఇక సెకండ్ హాఫ్ లో ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ స్కిల్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం బిలోవ్ యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు లియోన్‌ జేమ్స్‌ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా నికేత్ బొమ్మి చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ప్రదీప్ ఈ రాఘవ్ తగ్గించాల్సింది. నిర్మాతలు కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ అంటూ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, రెగ్యులర్ ప్లే, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version