సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాబోయే చిత్రం, కొండా, జూన్ 23, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో త్రిగుణ్ మరియు ఇర్రా మోర్ ప్రధాన పాత్రలు పోషించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని హంటర్ రోడ్ విష్ణు ప్రియా గార్డెన్స్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఇదే విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో ప్రకటించాడు. పృధ్వీ రాజ్, ప్రశాంత్ కార్తీ, పార్వతి అరుణ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. డిఎస్ఆర్ బాలాజీ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుస్మిత పటేల్ నిర్మించారు.