లాక్ డౌన్ రివ్యూ : దిల్ బేచారా-హిందీ ఫిల్మ్ (డిస్నీ హాట్ స్టార్)

లాక్ డౌన్ రివ్యూ : దిల్ బేచారా-హిందీ ఫిల్మ్ (డిస్నీ హాట్ స్టార్)

Published on Jul 25, 2020 11:37 PM IST
Gypsy Review

విడుదల తేదీ: జూలై 24, 2020

నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సంఘి, సైఫ్ అలీ ఖాన్

దర్శకుడు : ముఖేష్ ఛబ్రా

నిర్మాతలు : ఫాక్స్ స్టార్ స్టూడియోస్

సంగీతం : ఎ. ఆర్. రెహమాన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ చిత్రం దిల్ బేచారా ను ఎంచుకోవడం జరిగింది. ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం కావడంతో దీని కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

 

మన్నీ(సుశాంత్ సింగ్) కిజ్జి బసు (సంజన సంఘీ) క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటారు. క్యాన్సర్ ని లెక్క చేయని మన్నీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో కిజ్జి ని ప్రేమిస్తాడు. మొదట్లో మన్నీ ప్రేమను తిరస్కరించిన కిజ్జి తర్వాత అతని ప్రేమలో పడుతుంది. పారిస్ లో ఉన్న తన అభిమాన సింగర్ ని కలవాలని కిజ్జి, మన్నీతో చెబుతుంది. మరి పారిస్ వెళ్లి తన ఫేవరేట్ సింగర్ ని కలవాలన్న కిజ్జి డ్రీమ్ ని మన్నీ నెరవేర్చడా..? క్యాన్సర్ పేషెంట్స్ గా చివరి దశలో ఉన్న ఈ ప్రేమ జంట కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ…

 

ప్లస్ పాయింట్స్:

 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అందమైన తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలు కొల్లకొట్టాడు. క్యాన్సర్ రోగి అయినప్పటికీ జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించే యువకుడిగా ఆయన నటన చాలా సహజంగా ఉంది. కామెడీ సన్నివేశాలలో పాటు, క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన నటన అధ్బుతం అని చెప్పాలి. డల్ గా సాగే కొన్ని సన్నివేశాలకు కూడా సుశాంత్ ప్రజెన్స్ ఆకర్షణ తెచ్చింది.

ఇక యంగ్ హీరోయిన్ సంజన సంఘీ ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ. ఆమె నటన ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. దిల్ బేచారా మూవీలో ఆమె నటన చూసిన ఎవరైనా డెబ్యూ హీరోయిన్ అనుకోరు. సున్నితమైన ప్రేమ కథలో క్యాన్సర్ రోగిగా ఆమె నటన అద్భుతం. ఆమెకు బాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉన్న భావన కలిగింది.

ఇక ఈమూవీలో చెప్పుకోదగ్గ మరో ప్రధానాంశం రెహ్మాన్ మ్యూజిక్. ఆ అందించిన సాంగ్స్ మరియు నేపథ్య సంగీతం మరింత ఆకర్షణ చేకూర్చాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. చివరి 20నిముషాలలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ సినిమా ప్రధాన బలహీనత నిడివి అని చెప్పుకోవాలి. ఒక గంట నలభై నిమిషాల ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు త్వరగా ముగించిన భావన కలిగింది. హీరో హీరోయిన్ మధ్య మరి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటే బాగుండు అన్న భావన కలిగింది.

సన్నివేశాల పరంగా ఆకట్టుకున్నప్పటికీ మొత్తంగా సరైన ఫ్లో కనిపించదు. ఇక క్యాన్సర్ రోగులుగా వారిద్దరి పెయిన్ కూడా బలమైన సన్నివేశాలతో వివరించి ఉంటే.. ఇంకా బాగుండేది. ఇక కొన్ని సన్నివేశాలు అసహజంగా ఉన్నాయి.
సాంకేతిక విభాగం:

 

కెమెరా వర్క్ బాగుంది. ఇక ముందుగా చెప్పుకున్నట్లుగా ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతం. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన బెస్ట్ ఆల్బమ్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఇక దర్శకుడు ముఖేష్ చబ్రా తన మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించారు. లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్, ఎమోషన్స్ పై ఆయన మరింత శ్రద్ద పెట్టి ఉంటే మూవీ మరింత ఆక్షణీయంగా ఉండేది.
తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే దిల్ బేచారా ఒక సింపుల్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామా. సుశాంత్ రాజ్ పుత్ అద్భుత నటన, స్క్రీన్ ప్రజెన్స్ మరియు హీరోయిన్ మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఆకట్టుకొనే అంశాలు. కొన్ని సినిమాలకు కొలమానం ఉండదు. దిల్ బేచారా అలాంటి సినిమానే. సుశాంత్ సింగ్ చివరి చిత్రం అందరూ చూసి ఆయనకు ఘన నివాళి ఇవ్వండి.

 

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు