రివ్యూ: శకుంతలాదేవి- హిందీ ఫిల్మ్ (అమెజాన్ ప్రైమ్)

రివ్యూ: శకుంతలాదేవి- హిందీ ఫిల్మ్ (అమెజాన్ ప్రైమ్)

Published on Jul 31, 2020 2:48 PM IST
Uma Maheswara Ugra Roopasya Review

Release date : July 31st, 2020

123telugu.com Rating : 3.25/5

నటీనటులు : విద్యాబాలన్,జిష్షు సేన్‌గుప్తా, సన్యా మల్హోత్రా

దర్శకుడు : అను మీనన్

నిర్మాత : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, విక్రమ్ మల్హోత్రా

సంగీతం : సచిన్-జిగర్

 

లాక్ డౌన్ సిరీస్ లో భాగంగా నేడు గణిత మేధావి శకుంతలాదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శకుంతలాదేవి అనే హిందీ మూవీని ఎంచుకోవడం జరిగింది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథ:

కనీసం స్కూల్ కి కూడా వెళ్లని శకుంతలాదేవి(విద్యా బాలన్) తండ్రి మార్గదర్శకత్వంలో మ్యాథ్స్ జీనియస్ గా ఎదుగుతుంది. దీనితో లండన్ వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు, అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శంకుతల పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్త) ని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కూతురు అను( సన్యా మల్హోత్రా) పుట్టిన తరువాత భర్తను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఐతే కొంతకాలానికి కూతురు అను కూడా శకుంతలను వదిలేసి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొని ఎలా భర్త, కూతురు దగ్గరకు చేరింది అనేది మిగతా కథ..

 

ప్లస్ పాయింట్స్:

 

ఓ అద్భుతమైన పాత్ర విద్యాబాలన్ లాంటి నటికి దక్కితే ఎంతగా పండుతుందో అని చెప్పడానికి ఈ మూవీ ఒక ఉదాహరణ. వివిధ దశల వారీగా సాగే పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ విద్యాబాలన్ నటనతో కట్టిపడేస్తుంది. హ్యూమర్, కోపం, లెక్కచేయని తనం వంటి అనేక ఎమోషన్స్ ఆమె బాగా పండించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు కూతురుతో వచ్చే కాంబినేషన్ సీన్స్ లో విద్యా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

శాకుంతలాదేవి కూతురు పాత్ర చేసిన సన్యా మల్హోత్రా కూడా మంచి నటన కనబరిచారు. విద్యాబాలన్ తో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన అలరిస్తుంది. ఇక మూవీలో హ్యూమర్ మరియు ఎమోషన్స్ బాగా కుదిరాయి. ప్రేక్షకుడిని కదిలించే అనేక సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి.

ఇక భర్త పాత్ర చేసిన జిష్షు సేన్ గుప్తా ఆకట్టుకున్నారు. హ్యూమర్, ఎమోషన్స్ సహజంగా సాగుతూ నాటకీయంగా అనిపించకపోవడం మెచ్చుకోదగ్గ అంశం.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా మధ్య భాగంలో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు, ఆమె వాటిని ఎదుర్కొన్న విధానం మరికొంత ఎఫెక్టివ్ గా తీయాల్సింది..

ఇక ఈ మూవీ ప్రారంభం నుండి స్లోగా సాగుతుంది. మాథ్స్ జీనియస్ గా ఆమె చెసే అద్భుతాలు ఊహించినంత ప్రభావం చూపలేకపోయాయి.

 

సంకేతిక విభాగం:

 

నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. అలాగే కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రొడక్షన్ డిజైన్ మరియు బీజీఎమ్ ఆకట్టుకున్నాయి.

ఇక డైరెక్టర్ అను మీనన్ గురించి చెప్పాలంటే ఆమె అనుకున్న విషయాన్ని ప్రభావవంతంగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. శకుంతలాదేవి అనే పాత్రను మలచిన విధానం, విద్యాబాలన్ లాంటి బెస్ట్ యాక్టర్ నుండి నటన రాబట్టకున్న తీరు అద్భుతం. ఆకట్టుకొనే సన్నివేశాలలో సినిమా ఎక్కడా తగ్గకుండా నడిపించారు.

 

తీర్పు:

 

మొత్తంగా శాకుంతలాదేవి తల్లికూతరు మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. విద్యాబాలన్ అద్భుత నటన, ఆకట్టుకొనే కథనం, హ్యూమర్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకెళతాయి. మధ్య భాగంలో కొంచెం మూవీ నెమ్మదించడం, స్లోగా సాగే కథనం కొంచెం నిరాశపరిచే అంశాలు. మాథ్స్ జీనియస్ శకుంతలాదేవి జీవితంలో జరిగిన ఎమోషనల్ విషయాలను గురించి తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ లాక్ డౌన్ లో శకుంతలాదేవి మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు