‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి!

‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి!

Published on Oct 30, 2024 6:06 PM IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను-మాన్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా నటించగా, రామాయణ గాధకు సంబంధించిన కొన్ని అంశాలను కథలో భాగంగా చూపెట్టారు. ఇక ఈ క్రమంలో హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే, ఇప్పుడు ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్‌ని మేకర్స్ రివీల్ చేశారు. ఇంతకాలం హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారా అనే విషయానికి మేకర్స్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశారు. ‘జై హనుమాన్’ చిత్రంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హనుమంతుడిగా రిషబ్ శెట్టిని పవర్‌ఫుల్‌గా చూపెట్టారు. చేతుల్లో రామయ్య విగ్రహాన్ని పట్టుకున్న హనుమంతుడిని మనకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రివీల్ చేశారు.

దీంతో ఒక్కసారిగా ‘జై హనుమాన్’ మూవీపై అందరి దృష్టి మళ్లింది. ‘కాంతార’ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు