“జై హనుమాన్” లో అతడు దాదాపు ఖరారు!?

“జై హనుమాన్” లో అతడు దాదాపు ఖరారు!?

Published on Oct 19, 2024 2:21 AM IST


ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర రీసౌండింగ్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జ అలాగే ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ఇది కాగా ఇక్కడ నుంచి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కి నాంది కూడా పలికింది. అయితే పార్ట్ 1 లోనే హనుమాన్ గా ఎవరు కనిపిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

మరి దీనిని పార్ట్ 2 “జై హనుమాన్” లో రివీల్ చేస్తున్నట్టుగా ప్రశాంత్ వర్మ తెలిపాడు. అయితే ఈ పాత్రకో లేక మరో ముఖ్య పాత్రకో కానీ ప్రస్తుతం కన్నడ విలక్షణ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి పేరు వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు రిషబ్ పేరు జై హనుమాన్ కి దాదాపు ఖరారు అయ్యిపోయినట్టుగా కన్నడ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకవేళ రిషబ్ ఓకే అయితే తాను ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది మరింత ఆసక్తిగా మారింది. ఇక మరోపక్క రిషబ్ తన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం కాంతార పార్ట్ 1 లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు