“కాంతార 2” కి రిషబ్ శెట్టి సరికొత్త లుక్ వైరల్.!

“కాంతార 2” కి రిషబ్ శెట్టి సరికొత్త లుక్ వైరల్.!

Published on Nov 15, 2023 7:04 AM IST

కన్నడ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన పలు చిత్రాల్లో గత ఏడాది రిలీజ్ అయ్యిన డివోషనల్ హిట్ చిత్రం “కాంతార” కూడా ఒకటి. మరి కన్నడలో విడుదల అయ్యి నెక్స్ట్ తెలుగు హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యాక సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంని హీరో రిషబ్ శెట్టి నే తెరకెక్కించాడు. ఇక ఈ భారీ సక్సెస్ అనంతరం మేకర్స్ దీనికి రెండో భాగాన్ని కూడా ప్రీక్వెల్ గా అనౌన్స్ చేయడంతో ఈ మాసివ్ ప్రొజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం విషయంలో హీరో రిషబ్ శెట్టి మార్చిన సరికొత్త లుక్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. గత సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు తన లుక్ కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. కేజీయఫ్ లో యష్ తరహాలో లాంగ్ హెయిర్ మరియు గడ్డాన్ని బాగా పెంచేసాడు. దీనితో కాంతార 2 లో తాను ఈ సరికొత్త లుక్ లో కనిపిస్తాడు అని ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. లేటెస్ట్ గా తన నుంచి వచ్చిన కొన్ని లేటెస్ట్ పిక్స్ తో అయితే ఇది కన్ఫర్మ్ కాగా ఈ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు