శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మత్తు వదలరా 2’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రితేశ్ రానా ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేశ్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘మత్తు వదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని.. అయితే, అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.
దీంతో అభిమానుల్లో ‘మత్తు వదలరా 3’ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అందులో ఎలాంటి కథతో వస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.