సందీప్ కిషన్‌తో రీతూ వర్మ ‘మజాకా’!

సందీప్ కిషన్‌తో రీతూ వర్మ ‘మజాకా’!

Published on Oct 26, 2024 6:20 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, ‘పీపుల్ స్టార్’ సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ రివీల్ చేశారు.

‘మజాకా’ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ రీతూ వర్మ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓ వీడియో రూపంలో ఈ విషయాన్ని వారు వెల్లడించారు. పెళ్లికూతురి గెటప్‌లో రీతూ వర్మ అలిగి కూర్చోగా, ఆమెను ఆటపట్టిస్తున్నాడు సందీప్ కిషన్. ఇక ఈ సినిమాలో రీతూ వర్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథను అందిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ‘మజాకా’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు