ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “రాబిన్ హుడ్” కూడా ఒకటి. నితిన్ అభిమానులు ఎప్పుడు నుంచో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకి ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇపుడు రిలీజ్ కి వచ్చేసింది.
మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ తో స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. నితిన్ కంప్లీట్ గా ఫ్రెష్ లుక్స్ తో ఒక ఇంట్రెస్టింగ్ పాత్రలో కూల్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ తో వెంకీ కుడుముల మార్క్ ఎంటర్టైనింగ్ ట్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీలీలతో రొమాంటిక్ ట్రాక్స్ ఇంకా విలన్ గా ఆదిపురుష్ నటుడు దేవదత్ నాగే పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు.
ఇలా సాలిడ్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ చిన్నగా మొదలైనా గ్రాండ్ లెవెల్లోకి వెళ్లేలా కనిపించింది. ఇక లాస్ట్ లో అంతా ఎదురు చూస్తున్న డేవిడ్ వార్నర్ ఎంట్రీని లాలీ పాప్ తో మంచి కేజ్రీగా డిజైన్ చేయడం బాగుంది. ఇంకా ట్రైలర్ లో జీవి ప్రకాష్ స్కోర్ ఇంకా మేకర్స్ నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. మొత్తానికి మాత్రం నితిన్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేలా ఈ ట్రైలర్ కనిపిస్తుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి