హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తొలుత క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి లో శివరాత్రి కానుకగా వస్తుందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్త ఈ సినిమా రిలీజ్ విషయంలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీని ఏకంగా సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జివి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.