హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను మార్చి 28 నుంచి అలరించేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
కాగా, ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఫీట్ అందుకుంది. మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘రాబిన్‌హుడ్’ చిత్రం టాప్ ప్లేస్‌లో నిలిచినట్లు ఐఎండిబి సంస్థ పేర్కొంది. తెలుగులో మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘రాబిన్‌హుడ్’ నిలిచింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.