వాటి కోసం ఎదురుచూస్తున్న రాబిన్‌హుడ్..?


టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలతో డిసెంబర్ నెల ఈ ఏడాదిలోనే ది బెస్ట్ నెలగా మారనుంది. డిసెంబర్‌లో భారీ చిత్రాలతో పాటు మీడియం, చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డిసెంబర్‌లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్‌ని లాక్ చేసుకున్నాయి.

ది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 6న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాను మరోసారి వాయిదా వేసేందుకు వారు ఇష్టపడటం లేదు. అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇలా రెండు భారీ సినిమాలు ఒకే నెలలో వస్తుండటంతో మరో సినిమా వీటి కోసం ఆసక్తిగా చూస్తోంది.

హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ కూడా డిసెంబర్ నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. పుష్ప-2, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో ఏ ఒక్కటి రిలీజ్ వాయిదా పడ్డా, రాబిన్‌హుడ్ బరిలోకి దిగాలని స్కెచ్ వేసుకుని ఉన్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మరి రాబిన్‌హుడ్ ఎదురుచూపుకు ఈ రెండింట్లో ఏ సినిమా సైడ్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version