విడుదల తేదీ : మార్చి 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్ చాకో, లాల్ తదితరులు.
దర్శకుడు : వెంకీ కుడుముల
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం : జీవి ప్రకాష్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
ఎడిటర్ : కోటి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ ఉగాది కానుకగా మన తెలుగు సినిమా నుంచి ఆడియెన్స్ ని అలరించడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “రాబిన్ హుడ్” కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన చిన్ననాటి నుంచే అనాథ అయిన రామ్ (నితిన్) తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున్న వాళ్ళని ఇంట్రెస్టింగ్ ప్లాన్ లతో దోచుకుంటూ వారికి పంచిపెడుతూ ఉంటాడు. ఇంకోపక్క రుద్రకొండ అనే గ్రామపు నేలలో సాగు చేసే గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్న అత్యంత క్రూరుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూస్తున్న సామి (దేవదత్త నాగే) ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ వాసుదేవ్ (సిజ్జు) తన ఏవి ఫార్మా అధినేతకు ఉన్న లింక్ ఏంటి? ఈ క్రమంలో వాసుదేవ్ కూతురు నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకి అది కూడా రుద్రకొండకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అలా తనతో రామ్ కూడా వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు వెంకీ కుడుములకి మన తెలుగు సినిమాలో మంచి మార్క్. ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథలు చెప్పగలిగే కొద్ది మంది దర్శకుల్లో తాను కూడా ఒకరు. ఆల్రెడీ లాస్ట్ రెండు సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంటంని కొనసాగించడం ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాలో బాగుంది.
ఎక్కడికక్కడ సినిమాని ఏ ఎమోషన్ ని ఎంతవరకు క్యారీ చేయాలో అలానే తీసుకెళ్లారు. ఇక తన మార్క్ కామెడీ సీన్స్ అయితే సినిమాలో మంచి హిలేరియస్ గా పేలతాయి. మెయిన్ గా ఫస్టాఫ్ లో చాలా సీన్స్ ఇంటర్వెల్ ముందు వరకు భళే నవ్వులు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్ లో డీసెంట్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి.
ఇక నటీనటుల్లో నితిన్ వెంకీ దర్శకత్వంలో మరోసారి మంచి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్ లలో నితిన్ చాలా స్టైలిష్ గా పర్ఫెక్ట్ ఫుట్ స్టెప్స్ తో కనిపించాడు. అలాగే తన మార్క్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఎప్పటిలానే డీసెంట్ గా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కువుట్ అయ్యింది. ఇక హీరోయిన్ శ్రీలీల తన రోల్ బాగా చేసింది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే తనపై మంచి ఫన్ ని జెనరేట్ చేస్తాయి.
అలాగే నితిన్ తో తన కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్ అయ్యింది. ఇక విలన్ దేవదత్త నాగే అదరగొట్టారని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్ లో తన పాత్రకి తాను ప్రాణం పోశారు. స్టార్టింగ్ నుంచే తనలోని విలనిజాన్ని ఓ రేంజ్ తో చూపించారు. ఇక వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్, లాల్ లు మంచి ఎమోషనల్ పాత్రల్లో బాగా మెప్పించారు. ఇక వీరితో పాటుగా వెన్నెల కిషోర్ పై పలు కామెడీ సీన్స్ బాగా పండాయి. షైన్ టామ్ చాకో కూడా బాగా చేశారు. లాస్ట్ బట్ లీస్ట్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్ చేసారని చెప్పవచ్చు. లైట్ గా కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ తనలో నెగిటివ్ షేడ్ ని తాను బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం డీసెంట్ గానే ఉన్నప్పటికీ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొంతమేర స్క్రీన్ ప్లే మంచి హిలేరియస్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది కానీ అలా తర్వాత తర్వాతకి స్లో అయినట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో అయితే పలు పాత్రలు చాలా సేపటి వరకు ఆబ్సెంట్ గానే కనిపిస్తాయి.
వీటితో కథ అంతా ఎక్కడో డీవియేట్ అవుతుంది అనే సమయానికి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఇక వీటితో పాటుగా మొదట్లో అంత స్ట్రాంగ్ గా చూపించిన విలన్ ని క్లైమాక్స్ కి చేరుకునేసరికి ఒక సింపుల్ చేతకానివాడిలా చూపించడం బలహీనంగా అనిపిస్తుంది.
అలాగే ఫస్టాఫ్ లో కొనసాగిన హిలేరియస్ నరేషన్ సెకండాఫ్ లో కొంచెం డోస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో రెండు పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ఉన్న ఫ్లోని అలా దెబ్బ తీసినట్టుగా అనిపిస్తుంది. అవి లేకుండా ఉంటే ఇంకా బెటర్ గా ఫీల్ కలిగి ఉండేది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకటీ రెండు చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. ఒక సీన్ లో నితిన్ ముఖంపై రక్తపు మచ్చ క్లియర్ గా గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. ఎలాంటి వాటిలో జాగ్రత్తలు వహించాల్సింది. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. అనవసర పాటలు ఫ్లో దెబ్బ తీయకుండా కట్ చేసేయాల్సింది.
ఇక దర్శకుడు వెంకీ కుడుముల విషయానికి వస్తే తాను.. దర్శకునిగా ఈ సినిమాకి మెప్పిస్తారు అని చెప్పవచ్చు. తన డీటైలింగ్ కొన్ని కొన్ని సీన్స్ ఆడియెన్స్ పల్స్ కి తగ్గట్టుగా కట్ చేసి కనెక్ట్ చేయడం యాక్షన్ సీన్స్ టేకింగ్ తనలోని స్టైలిష్ విజనరీ ఫిల్మ్ మేకర్ ని చూపిస్తుంది. అయితే మంచి హిలేరియస్ గా కథనం నడిపిన తాను కొన్ని అంశాలు మాత్రం రొటీన్ గానే చూపించారు. గంజాయి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు కనిపించాయి. వాటితో ఇందులో చాలా సీన్స్ ఒకింత రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. కానీ హీరోకి పెట్టిన మోటివ్ అలానే ఎమోషనల్ కనెక్షన్ లు మాత్రం తన నుంచి మెప్పిస్తాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రాబిన్ హుడ్” దాదాపు అన్ని ఎమోషన్స్ కలిపిన డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. వెంకీ మార్క్ హిలేరియస్ సీన్స్ సహా పలు ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ సహా నటుడు దేవదత్త నాగే మెస్మరైజ్ చేస్తారు. కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్ నరేషన్ ఉండి ఉంటే బాగుండేది. అయినప్పటికీ వీకెండ్ లో మంచి టైం పాస్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునేవారికి రాబిన్ హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team