రాబిన్‌హుడ్ నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది – హీరో నితిన్

హీరో నితిన్ నటించిన హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘రాబిన్‌హుడ్ ఫైనల్ కాఫీ చూసాము. చాలా హ్యాపీగా ఉన్నాము. సినిమా చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో, చూసుకున్నప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ గా అనిపించింది. వెంకీ నా కాంబినేషన్లో వచ్చిన భీష్మ కంటే ఈ సినిమా చాలా బాగుండబోతుంది. మార్చి 28న సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను.’ అన్నారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతోంది. మొత్తం అవుట్ పుట్ చూసుకున్నాం. వెరీ హ్యాపీ. ఆడియన్స్ అందరూ సినిమా చూసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్మకం వుంది’ అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘సినిమా అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. పబ్లిసిటీ పరంగా కూడా చాలా బాగా ఆడియన్స్ కి చేరింది. సినిమా మంచి ఫన్ ఎంటర్ టైనర్. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చారు.

నితిన్ గారు ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్లేటర్. చాలా స్మార్ట్ మైండ్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్లైమాక్స్ లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్టులు, షాకులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. భీష్మ సినిమాలో కంటే నా క్యారెక్టర్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ గా ఉంటుంది. వెరీ ఇంటలెక్చువల్ క్యారెక్టర్.

వెంకీ గారు వార్నర్ గారు ఎలాంటి మ్యాజిక్ చేయించారు ?

ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని ఆ పాత్రకు వార్నర్ అనుకున్నా. నిర్మాత రవి గారు చాలా సీరియస్ గా ట్రై చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. నేను ఇచ్చిన నరేషన్ ఆయన నచ్చి అంగీకరీంచారు. ఇందులో ఆస్ట్రేలియా ఎపిసోడ్ వుంది. వార్నర్ క్యామియో అక్కడే షూట్ చేశాం. అది మీరు థియేటర్లో చూసినప్పుడే మ్యాజిక్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ మిస్ అవుతుంది. థియేటర్స్ లో చూసినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

నితిన్ గారు ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఏమి ఆశించవచ్చు?

ఈ సినిమా చాలా మంచి ఎంటర్ టైన్మెంట్ వుంది. ఎమోషన్ కూడా ఉంది. హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతి పొందుతారు.

నితిన్ గారు శ్రీలీల గారితో వర్క్ ఎలా అనిపించింది?

శ్రీలీలతో ఇది నా సెకండ్ ఫిల్మ్. తను చాలా స్వీట్. షూటింగ్ అంతా చాలా చక్కగా జరిగింది. తనతో ఫ్యూచర్ లో మళ్ళీ వర్క్ చేయాలని వుంది.

రవి గారు ఈ వారం నాలుగు సినిమాలు వస్తున్నాయి.. సోలో డేట్ వుంటే ఇంకా బెటర్ గా ఉండేది కదా?

ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో ఆశించకూడదు. మేము వస్తున్నప్పుడు ఒకటే సినిమా అనుకున్నాం. కానీ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది మేము ముందుగా ఊహించలేదు. ఎవరి సినిమాలు. ఎవరి డేట్లు, ఎవరి కమిట్మెంట్లు వాళ్లకు ఉంటాయి. మనం చేస్తున్నప్పుడే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్ సెట్ తోనే దిగాలని భావిస్తాను.

నితిన్ గారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

వెరీ హ్యాపీ. మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. మా సినిమా కూడా బ్యానర్ ప్రతిష్టని పెంచే సినిమా అవుతుందని నమ్మకం ఉంది.

Exit mobile version