ఎమోషనల్ గా రాకింగ్ రాకేష్ “కేసీఆర్” ట్రైలర్

ఎమోషనల్ గా రాకింగ్ రాకేష్ “కేసీఆర్” ట్రైలర్

Published on Oct 19, 2024 4:52 PM IST


తెలుగు స్మాల్ స్క్రీన్ హిట్ షో “జబర్దస్త్” నుంచి వచ్చిన ఎంతోమంది ప్రముఖ కమెడియన్స్ లో యువ నటుడు రాకింగ్ రాకేష్ కూడా ఒకడు. మరి తన టాలెంట్ తో బుల్లితెరపై సత్తా చాటిన ఈ యంగ్ కమెడియన్ సిల్వర్ స్క్రీన్ పై కూడా పలు సినిమాలు చేసాడు. కానీ ఇప్పుడు తానే లీడ్ రోల్ లో చేసిన లేటెస్ట్ చిత్రమే “కేశవ చంద్ర రామావత్”.

షార్ట్ కట్ గా “కేసీఆర్” గా మేకర్స్ నామకరణం చేసిన ఈ సినిమా నుంచి నేడు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. దీనితో రాకింగ్ రాకేష్ కి ఈ సినిమా ఓ డీసెంట్ ఎమోషనల్ డెబ్యూ గా మారేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, రచన సహా నిర్మాణం రాకింగ్ రాకేష్ అందించగా గరుడ వేగ అంజి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే విభూది ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు