కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఇప్పుడు తన భారీ చిత్రాలు “కేజీయఫ్” ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి భారీ సినిమాల తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే విధంగా ఎలాంటి సినిమా చేస్తాడు అనే సమయంలో అనౌన్స్ చేసిన మరో భారీ చిత్రమే “టాక్సిక్”.
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రం మంచి అంచనాలు అందుకుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ మధ్య మొదలయ్యింది కానీ ఈ సినిమాకి యష్ లుక్ ఏంటి అనేవి ఏవి బయటకి రాలేదు. కానీ ఇప్పుడు యష్ సరికొత్త మేకోవర్ లీక్ అయ్యి వైరల్ గా మారింది. బయట యష్ కనిపించగా ప్రేక్షకులు తన కొత్త లుక్స్ క్లిక్ మనిపించారు.
దీనితో సోషల్ మీడియాలో తన కొత్త లుక్ వైరల్ గా మారింది. మరి అదే గడ్డంలో కాకపోతే ఈసారి కొత్త హెయిర్ స్టైల్ ని యష్ డిజైన్ చేయించుకున్నాడు. మరి ఇందులో తాను సూపర్ స్టైలిష్ గా కనిపిస్తుండగా టాక్సిక్ కి ఇదే లుక్ అంటూ ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు.