“కల్కి 2898 ఎడి” పై రాకీ భాయ్ రివ్యూ వైరల్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ సై ఫై అండ్ మైథలాజి డ్రామా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి నిన్న థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర రికార్డు ఓపెనింగ్స్ సాధించింది.

అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా సినీ ప్రముఖులు అందరు పొగుడుతూ ఎన్నో ట్వీట్స్ కూడా వేశారు. అలా లేటెస్ట్ గా పాన్ ఇండియా రాకీ భాయ్ కన్నడ స్టార్ నటుడు యష్ తన రివ్యూ ఈ సినిమాపై అందించడం వైరల్ గా మారింది. విజువల్ గా ఒక అద్భుతాన్ని అందించిన కల్కి 2898 ఎడి టీం అందరికీ నా అభినందనలు అందిస్తున్నాను అని ఈ సినిమాతో సినిమా స్టోరీ టెల్లింగ్ ని మరింత అందంగా ఎలా చెప్పాలో చూపించింది అని నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ వారి విజన్, ధైర్యం ఖచ్చితంగా మరిన్ని భారీ చిత్రాలని తీసుకొచ్చే విధంగా ప్రేరణగా నిలుస్తాయి అని తెలిపాడు.

అలాగే అలాగే డార్లింగ్ ప్రభాస్, కమల్ హాసన్ గారు, అమితాబ్, దీపికా పడుకోణ్ ఇంకా సర్ప్రైజ్ క్యామియోలో కనిపించిన వారు ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని అందించారు అని ఈ సినిమాని తీసుకొచ్చేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని యష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో ఇది ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Exit mobile version