రోషన్ కనకాల కొత్త సినిమా..ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌కి టైమ్ ఫిక్స్

రోషన్ కనకాల కొత్త సినిమా..ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌కి టైమ్ ఫిక్స్

Published on Sep 6, 2024 9:00 PM IST

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు తన రెండో సినిమాను లైన్‌లో పెట్టాడు ఈ యంగ్ హీరో. ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను తీసుకొస్తున్నాడు రోషన్ కనకాల.

‘కలర్ ఫోటో’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఇప్పుడు రోషన్ కనకాలతో సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను వినాయక చతుర్థి సందర్భంగా రేపు ఉదయం 11.34 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఓ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పోస్టర్‌లో ఓ గుర్రంతో పాటు రోషన్ కనకాల అడవిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.

మొత్తానికి తన సెకండ్ మూవీపై రోషన్ కనకాల ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు