‘మోగ్లీ’గా వస్తున్న రోషన్ కనకాల

‘మోగ్లీ’గా వస్తున్న రోషన్ కనకాల

Published on Sep 7, 2024 6:00 PM IST

టాలీవుడ్‌లో ‘బబుల్ గమ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇప్పుడు రోషన్ తన నెక్స్ట్ చిత్రాన్ని లైన్‌లో పెడుతున్నాడు. ‘కలర్ ఫోటో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రాజ్ డైరెక్షన్‌లో రోషన్ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘మోగ్లీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ప్రకటించారు. ఇక గుర్రంతో పాటు రోషన్ ఓ అడవిలో ఉన్నట్లుగా మనకు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు మురళి అలియాస్ మోగ్లీ అని.. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తుండగా.. రామ మూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు