ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

Published on Dec 12, 2024 8:59 AM IST

రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర పలు పెద్ద చిత్రాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా కొన్ని వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో యువ నటీనటులు కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ సందీప్ సరోజ్, సుప్రజ్, హర్ష నర్రా, తరుణ్ పొనుగంటి తదితరులు నటించిన చిత్రం “రోటి కపడా రొమాన్స్” కూడా ఒకటి. దర్శకుడు విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ టాక్ ని చూసిన వారి నుంచి తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో వచ్చేసింది. యువత ప్రేమ అలాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించిన ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు చూడాలి అనుకుంటే ఈటీవీ విన్ లో ప్రసారం అవుతోంది ఓ సారి ట్రై చేయవచ్చు. యువతకి నచ్చే అంశాలు ఆలోచింపజేసే సీన్స్ తో మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రానికి సన్నీ ఎం ఆర్, ఆర్ ఆర్ ధృవన్ లు సంగీతం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు