‘రోటి కపడా రొమాన్స్’ అందరికీ మంచి బ్రేక్ ఇవ్వాలి – తేజా సజ్జా

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రంలోని నటీనటులు, చిత్ర నిర్మాతలు, దర్శకుడుతో పాటు దర్శకులు యదు వంశీ, పవన్‌ సాధినేని, హర్ష, రచయిత కోనవెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో తేజా సజ్జా విచ్చేశారు.

ఈ సందర్భంగా తేజా సజ్జా మాట్లాడుతూ.. ‘‘ఈ వేదిక మీద ఉన్న నూతన టాలెంట్‌కు ఈ సినిమా ఎన్నో ఏళ్ల కల. ఈ చిత్రంతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు తీసిన 14 సినిమాల్లో ఎంతో మంది దర్శకులను, రచయితలను, నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. నేను కూడా కెరీర్‌ ప్రారంభంలో గోపీ గారి ఆఫీసుకు వెళ్లేవాడిని. కానీ ఆయనతో సినిమా కుదరలేదు. ఇక రోటి కపడా రొమాన్స్‌తో ఈ నవంబరు 22న చాలా మంది నూతన నటీనటులు పుట్టబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించి, అందరికి మంచి బ్రేక్‌ నివ్వాలి. తప్పకుండా అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

దర్శకుడు విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చాలా కష్టపడి దర్శకుడి నా పేరు చూసుకుంటున్నాను. ఈ సినిమాను కూడా ఎంతో కష్టపడి చేశాను. నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఈసినిమా ఉంటుంది. ఈ సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది.. బాధపెడుతుంది.. ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ , థియేట్రికల్‌ రైట్స్‌ ఇలా అన్ని హక్కులు విడుదలకు ముందే అమ్మేశారు. సినిమా చూసి నచ్చి అందరూ హక్కులు కొనుక్కున్నారు. దీంతో మాకు విజయంపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమా విజయం సాధించకపోతే నేను దర్శకుడిగా రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నాను’’ అని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో అన్ని ఎమోషన్ష్‌ ఉంటాయి. ముఖ్యంగా నేటి యూత్‌కు నచ్చే లవ్‌స్టోరీలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు. సినిమాను చాలా మందికి చూపించాం. అందరికి ఎంతో బాగా నచ్చింది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Exit mobile version