కిట్టు తాటికొండ, కష్మీరా, రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “కరణం గారి వీధి”. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్‌బస్టర్ క్రియేషన్స్ బ్యానర్ పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శకద్వయం హేమంత్, ప్రశాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘కరణం గారి వీధి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా ఇండస్ట్రీకి వస్తే అంత మంచిది. కరణం గారి వీధి సినిమా సక్సెస్ అయి మొత్తం టీమ్ కు మంచి పేరు తేవాలి. కొత్త ఫిలింమేకర్స్ కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది.’ అని అన్నారు.
నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ.. ‘మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం.’ అని అన్నారు.
దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం.’ అని అన్నారు.
హీరో కిట్టు తాటికొండ మాట్లాడుతూ.. ‘కరణం గారి వీధి సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను. నాది ఈ మూవీలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్. మా డైరెక్టర్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రూపొందించారు. మా సెకండ్ హీరోయిన్ వైశాలి బాగా పర్‌ఫార్మ్ చేసింది. సినిమా బాగా వచ్చింది. మీ అందరి సపోర్ట్ తో మంచి సక్సెస్ అందుకుంటామని ఆశిస్తున్నాం.’ అని అన్నారు.
హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ.. ‘కరణం గారి వీధి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. కరణం గారి వీధి చిత్రంతో మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని నమ్ముతున్నాం.’ అని అన్నారు.