సినిమా పోస్టర్లు చూసి తెలుగు నేర్చుకున్నాడట

సినిమా పోస్టర్లు చూసి తెలుగు నేర్చుకున్నాడట

Published on Jul 29, 2024 8:01 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరై తన సినీ జర్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆర్పీ పట్నాయక్‌ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను పుట్టి పెరిగిందంతా ఒడిశాలోనే. అందుకే, నా కెరీర్ తొలినాళ్లలో తెలుగుపై నాకు పట్టు తక్కువ ఉండేది. ఆ సమయంలో నాకు బాగా గుర్తు. తెలుగు సినిమా పోస్టర్లు చూసి తెలుగు నేర్చుకున్నాను.

నిజానికి నేను ఒరియాలో చదువుకున్నా, ఇంట్లో మాత్రం కచ్చితంగా తెలుగులోనే మాట్లాడేవారు. తెలుగు పాటలే వినిపించేవి. నేనెప్పుడు పెద్దబాలశిక్ష చదవలేదు. పద్యాలు, గ్రంథాలు చదవలేదు. కానీ , వాటన్నిటి కంటే వెయ్యిరెట్లు ఎక్కువ నాలెడ్జి సీతారామశాస్త్రి గారి నుంచి నేర్చుకున్నాను. అప్పట్లో నేను, త్రివిక్రమ్‌, సునీల్‌ ముగ్గురం రూమ్‌మేట్స్‌. మా రూమ్‌ ముందే సిరివెన్నెల గారు ఉండేవారు. అప్పటి నుంచి పరిచయం పెరిగింది. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను.’ అని ఆర్పీ పట్నాయక్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు