ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ఆడుతున్నాడు. అతను చాలా గొప్ప బౌలర్ అని.. రాజస్థాన్‌కు వికెట్లు తెచ్చిపెడతాడని అందరూ ఆశించారు. కానీ అతడు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం సరిగా పర్ఫార్మ్ చేయలేదు. తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అధిక పరుగులు ఇచ్చుకున్నాడని.. రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో క్వింటన్ డి కాక్ సెంచరీ చేయకుండా ఆపడానికి ఆర్చర్ వైడ్ బంతులు వేశాడని తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి
ఐపీఎల్ 2025లో జోఫ్రా ఆర్చర్ ఆటతీరు ఎలా ఉందంటే:
మొదటి మ్యాచ్: RR vs SRH (మార్చి 23, 2025)
ఆర్చర్ మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో SRHతో ఆడాడు. అతను 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలింగ్.
రెండో మ్యాచ్: RR vs KKR (మార్చి 26, 2025)
రెండో మ్యాచ్‌లో ఆర్ఆర్ 151 రన్స్ చేసింది. కానీ కేకేఆర్ సులభంగా గెలిచింది. డి కాక్ 97 రన్స్‌తో ఆట ముగించాడు. ఆర్చర్ 2.3 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు.
చివరి ఓవర్‌లో కేకేఆర్‌కి 7 రన్స్ కావాల్సి ఉండగా ఆర్చర్ రెండు వైడ్ బంతులు వేశాడు. దీంతో డి కాక్ సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో ఆర్చర్ ఉద్దేశపూర్వకంగా వైడ్ వేశాడని అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఆర్చర్ ఫామ్ సరిగా లేదని.. అతని వేగం, బంతి లైన్ సరిగ్గా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ అతన్ని ప్రధాన బౌలర్‌గా తీసుకుంది. కానీ అతను రన్స్ ఆపలేకపోతున్నాడు. దీంతో టీమ్ అతడిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అతడిని ఆర్ఆర్ టీమ్ రూ.12.5 కోట్ల ధరతో కొనుగోలు చేసింది. అతని ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడని అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి తన నెక్స్ట్ మ్యాచ్‌లోనైనా ఆర్చర్ తన ఫామ్‌ని మెరుగుపర్చుకుంటాడేమో చూడాలి.