అక్కడ “RRR” బిహైండ్ & బియాండ్ రిలీజ్ డేట్ ఫిక్స్..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వసూళ్ళని మించి తెలుగు సినిమాకి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇలా గ్లోబల్ వైడ్ గా అదరగొట్టిన ఈ చిత్రం వెనుక ఉన్న కష్టాన్ని మేకింగ్ గా RRR బిహైండ్ అండ్ బియాండ్ అంటూ మేకర్స్ ఓ స్పెషల్ డాక్యు చిత్రాన్ని తీసుకొచ్చారు.

అయితే ఇది మన దగ్గర తెలుగు స్టేట్స్ లో లిమిటెడ్ గా పలు థియేటర్స్ లో తీసుకురాగా యూఎస్ లో కూడా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇపుడు దీనికి డేట్ ఫిక్స్ చేసేసారు. దీనితో ఈ డిసెంబర్ 24 నుంచి కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి అక్కడ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

Exit mobile version