ఆర్ ఆర్ ఆర్ భామ మరో భారీ చిత్రంలో

ఆర్ ఆర్ ఆర్ భామ మరో భారీ చిత్రంలో

Published on Oct 17, 2019 1:33 AM IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ మరో భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ లో దేవదాస్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి ప్రతిష్ట్మాక చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రంలో హీరోయిన్ గా అలియా ఎంపికైంది. గంగూబాయ్ కథియావాడి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అలియా నటిస్తుంది. ఈ విషయాన్నీ నేడు ఆమె సోషమ్ మీడియా వేదికగా పంచుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సొంత నిర్మాణ సంస్థ ఇతర సంస్థలతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ప్రకటన రోజునే మూవీ 2020 సెప్టెంబర్ 11న విడుదల అంటూ తేదీ ఖరారు చేయడం విశేషం. సంజయ్ లీలా భన్సాలీ నిజానికి సల్మాన్ ఖాన్, అలియా జంటగా, ఇన్షాల్లా అనే చిత్రం తెరకెక్కించాలనుకున్నారు. ఐతే సల్మాన్ కి దర్శకుడికి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా ఆ చిత్రం అయిపోయింది. ఇక అలియా భట్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, అమితాబ్ వంటి వారు నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు