మరో ఇంటర్నేషనల్ నామినేషన్ లో “RRR”.!


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఎంతో ఖ్యాతిని గడించిన ఈ చిత్రం తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమాకి కూడా గర్వకారణంగా నిలిచింది.

మరి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న ఈ చిత్రం దీని సహా మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ నామినేషన్స్ లో నిలిచింది. ఇక లేటెస్ట్ గా అయితే బెస్ట్ ఫారిన్ మూవీ ట్రైలర్ కట్ జాబితాలో అయితే ప్రముఖ ఇంటర్నేషనల్ గోల్డెన్ ట్రైలర్ అవార్డ్స్ లో అయితే పలు ఇతర దేశాల సినిమాలు ట్రైలర్స్ సహా RRR ట్రైలర్ కట్ కూడా ఇప్పుడు నామినేషన్ లో నిలిచింది.

అయితే దీనితో మరోసారి RRR కోసం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే అప్పట్లో యూఎస్ లో RRR రీ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ కట్ ని నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ అవార్డు RRR కి డెఫినెట్ గా వస్తుంది అని చాలా మంది ఆశిస్తున్నారు.

Exit mobile version