జపాన్ లో 105వ రోజు “RRR” సెన్సేషన్.!

Published on Feb 4, 2023 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాసివ్ గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. తెలుగు సినిమా మరియు ఇండియన్ సినిమా కి కూడా ఎంతో గర్వకారణంగా నిలిచిన ఈ భారీ సినిమా ఆస్కార్ వరకు వెళ్లి చరిత్ర సృష్టించింది. మరి ఈ సినిమా ఇటీవలే జపాన్ లో 100 రోజుల సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని 100 కి పైగా కేంద్రాల్లో జరుపుకోవడం మరో అరుదైన ఘనతగా మారగా..

ఈ చిత్రం ఈ చిత్రం అక్కడ అంతకంతకు వండర్స్ నమోదు చేస్తుంది. మరి ఈ సినిమా ఇప్పుడు 105వ రోజు కి అక్కడా చేరుకోగా ఈ 105 వ రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యిన రోజు కన్నా ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది అట. దీని బట్టి అక్కడ ఈ సినిమా హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా 5 లక్షల 13 వేల 787 ఫుట్ ఫాల్స్ కూడా నమోదు అయ్యాయని చిత్ర యూనిట్ చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :