ఒకేరోజు మూడు ఛానెల్స్ లో గ్రాండ్ ప్రీమియర్ గా “RRR” బ్లాస్ట్.!

Published on Aug 11, 2022 6:34 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ వసూళ్లతో అనేక రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఓటిటి లో వచ్చాక అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ రీచ్ ఈ సినిమాకి వచ్చింది. ఇక ఇప్పుడు అయితే ఫైనల్ గా ఈ చిత్రం బుల్లితెరపై బ్లాస్ట్ కి సిద్ధం అయ్యింది.

ఆల్రెడి మన తెలుగులో గ్రాండ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. ఇక ఇదే ఆగస్ట్ 14న అయితే ఈ చిత్రం మొత్తం మూడు ఛానెల్స్ లో ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్టుగా తెలిపారు. తెలుగు వెర్షన్ కి స్టార్ మా లో సాయంత్రం ఐదున్నరకి అలాగే మళయాళం లో ఆసియ నెట్ ఛానెల్లో 7 గంటలకి ప్రసారం కానుండగా హిందీలో జీ సినిమాలో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ కానుంది. మొత్తానికి అయితే ఒకే రోజు మూడు ఛానెల్స్ లో టెలికాస్ట్ కానుంది. మరి ఈ చిత్రం అయితే ఎలాంటి రేటింగ్స్ నమోదు చేస్తుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :