తెలుగులో “RRR” హిందీ వెర్షన్ రేటింగ్ ఎంతంటే.?

Published on Sep 24, 2022 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో రీచ్ ని అందుకుంది. ఇక థియేటర్స్ తర్వాత ఓటిటి లో కూడా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రం తర్వాత టెలివిజన్ స్క్రీన్ పై కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సినిమాని తెలుగులో హిందీ వెర్షన్ ని వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. అయితే ఈ కొత్త రకం టెలికాస్ట్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రానికి తెలుగులో హిందీ టెలికాస్ట్ కి గాను కేవలం 4.6 రేటింగ్ మాత్రమే వచ్చిందట. తెలుగులో ఇంకా మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే బెటర్ గా వచ్చి ఉండొచ్చేమో అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :