ఆర్ ఆర్ ఆర్ కి కట్టప్ప ఆయనేనా?

Published on Jul 14, 2020 9:46 pm IST

రాజమౌళి కీర్తిని, తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా రాజమౌళి తీర్చిదిద్దారు. అందులో సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర మరింత ప్రత్యేకం. బాహుబలిలో ప్రభాస్ మరియు రానా తరువాత కట్టప్ప పాత్రకు చాలా పేరువచ్చింది. సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలకు సమానంగా రాజమౌళి కట్టప్ప పాత్రను తీర్చిదిద్దారు.

కాగా మరి ఆర్ ఆర్ ఆర్ లో ఆ తరహా పాత్ర ఉందా అనే సందేహం ప్రేక్షకులలో మొదలైంది.ఐతే ఆర్ ఆర్ ఆర్ లో అంత బలమైన పాత్రగా అజయ్ దేవ్ గణ్ పాత్ర ఉండే అవకాశం ఉంది. బాహుబలి కట్టప్ప పాత్ర వలె సినిమాలో పూర్తి నిడివి ఉండనప్పటికీ కథలో చాలా కీలకం అని తెలుస్తుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ లో కట్టప్ప అంతటి బలమైన పాత్ర అజయ్ దేవ్ గణ్ చేస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

More