నెట్ ఫ్లిక్స్ లో మళ్ళీ రైజ్ “RRR” భారీ రెస్పాన్స్..!

Published on Jul 7, 2022 1:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఓటిటిలో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా రాని ఆదరణను దక్కించుకుంది. అంతేకాకుండా పలు హాలీవుడ్ సినిమాలతో పోటీగా కూడా నిలిచింది.

ఇక నెట్ ఫ్లిక్స్ లో మొదటి నాలుగు వారాలు కూడా నాన్ ఇంగ్లీష్ లిస్ట్ లో ఆల్ టైం టాప్ లో భారీ హావర్స్ స్ట్రీమింగ్ తో టాప్ లో నిలిచిన ఈ చిత్రం ఇపుడు ఏడో వారంలోకి వచ్చి కూడా ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా గత వారం వ్యూస్ అంతకుముందు రెండు వారాల వ్యూస్ కన్నా అధికంగా రావడం విశేషం దీనితో ఈ అంశాన్నే చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సినిమా సెన్సేషన్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :