RRR ఫర్ ఆస్కార్స్: కీలక పోస్ట్ చేసిన టీమ్!

RRR ఫర్ ఆస్కార్స్: కీలక పోస్ట్ చేసిన టీమ్!

Published on Oct 6, 2022 1:30 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ను ఆస్కార్స్ కి పంపిన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.

జనరల్ కేటగిరీ లో ఈ చిత్రాన్ని ఆస్కార్స్ కి పంపినట్లు చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా, RRR పై ప్రేమ చూపిస్తున్న సినీ ప్రేక్షకులకూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది టీమ్. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు.

https://twitter.com/RRRMovie/status/1577914856744767489?t=PiSbcCT5cUjZg8x435A5Zw&s=19

సంబంధిత సమాచారం

తాజా వార్తలు