హైదరాబాద్ : ఏప్రిల్ : 4
అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్’. గురించి దేశం మొత్తం రాజమౌళి సృజనాత్మక మేధస్సుపై ప్రశంసలు వర్షిస్తోంది. ఈ సందర్భంలో మరొక ఆసక్తి కరమైన అంశం ఏమంటే … థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శన మొదలవ్వగానే రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఫోటో కనిపిస్తుంది. ఫోటో ఒక్కటే కాదు క్రింద స్పెషల్ థాంక్స్ టు శ్రీ పురాణపండ శ్రీనివాస్ గారు అని దర్శనమిస్తుంది.
పురాణపండ శ్రీనివాస్ పేరు వినగానే మనకి ఎన్నో పరమాద్భుతమైన ధార్మిక గ్రంధాలు కనులముందు కదలాడతాయి. శ్రీనివాస్ సొగసైన భాషా సౌందర్యంగురించీ, నాణ్యతా ప్రమాణాల ముద్రణ గురించీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగునాట ఆధ్యాత్మిక రంగంలో ఒక మహోన్నత జయపతాకమే పురాణపండ శ్రీనివాస్ అని ఎందరో పీఠాధిపతులు , మఠాధిపతులు ఆశ్చర్యంగా అభినందిస్తున్నారు కూడా. జీవితమే ఒక గొప్ప యుద్ధంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి గోదావరీ తీరానికి మహోన్నత ఘనతను సాధించిపెట్టి, తెలుగు రాష్ట్రాలే కేంద్రాలుగా దేశదేశాలవారికీ పుంజీభూత మహా చైతన్యాన్ని పంచుతున్న పురాణపండ శ్రీనివాస్ పేరు ఆర్ ఆర్ ఆర్ మహా చిత్రంలో ఫోటోతో ప్రత్యక్షం అవ్వడం పట్ల మేధో సమాజం , పండిత సమాజం, సినీ విశ్లేషకులు రాజమౌళి హృదయ సంస్కారాన్ని, శ్రీనివాస్ నిర్మాణాత్మక ప్రతిభా చాతుర్యాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నారు.
వందలాది కవులను, పండితులను , మేధావులను, కళాకారులను ఈ దేశానికి అందించిన గోదావరీ తీరం పురాణపండ శ్రీనివాస్ లాంటి ఒక అద్భుతాన్ని అందించడం గర్వకారణమని తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక సలహాదారులు , సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి సైతం అభినందించడం మామూలు విషయం కాదు. నలుగురు ముఖ్యమంత్రులు ఆవిష్కరించి అభినందించిన మహాద్భుత గ్రంధాల అపురూపపు విలువల రచయిత తెలుగునాట పురాణపండ శ్రీనివాస్ మాత్రమేనని గర్వంగా చెప్పక తప్పదు.
రాజమౌళి అపురూప దృశ్య కావ్యం ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ లో శ్రీనివాస్ ను కృతజ్ఞతాపూర్వకం చూపించడం పట్ల సినీవిశ్లేషకులు అభినందించడం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పాలి. ఈ దేశంలో ఎవ్వరూ అందించని ధార్మికగ్రంథాల్ని క్రొత్త పుంతలు తొక్కిస్తూ అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ ఎంతో కష్టజీవి అని ఎందరో ప్రముఖులు సైతం ఢంకా బజాయించి చెప్పడం కఠోరసత్యం
శ్రీనివాస్ పేరు కేవలం తెలుగు RRR లో మాత్రమే కాదు మిగిలి నాలుగు భాషల్లో RRR లో కూడా మారు మ్రోగుతోంది. గాడ్ బ్లెస్స్ యు శ్రీనివాస్ గారూ !