ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Nov 29, 2021 4:42 PM IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఒక సరికొత్త పోస్టర్ తో వెల్లడించడం జరిగింది. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు