భీం రాకపై అలెర్ట్ చేస్తున్న “RRR” టీం.!

Published on Oct 18, 2020 6:33 pm IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ విజువల్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. కనీ వినీ ఎరుగని రీతిలో జక్కన ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం విషయంలో ప్రతీ ఎలిమెంట్ కూడా ఉహించని రీతిలో ఉంటుందని మోషన్ పోస్టర్ నుంచి అల్లూరిగా చరణ్ ను చూపిన టీజర్స్ ను చూస్తేనే అర్ధం అవుతుంది.

ఇక ఇప్పుడు అసలు సిసలైన మజాకు టైం స్టార్ట్ కాగా అందుకు RRR యూనిట్ కూడా రంగం సిద్ధం చేసింది. కొమరం భీం గా తారక్ పై డిజైన్ చేసిన సూపర్బ్ టీజర్ కోసం రాజమౌళి అండ్ టీం తారక్ అభిమానులను అలెర్ట్ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ 22న ప్లాన్ చేసిన ఈ టీజర్ కు ఇంకా 4 రోజులే ఉందంటూ చిత్ర యూనిట్ నుంచి పోస్ట్ చేసి మరిన్ని అంచనాలు పెంచేశారు. మరి వీరు ప్లాన్ చేసిన ఈ టీజర్ ఎలా ఉండనుందో అని తారక్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More