రాజమౌళి వారిని ఎలా ఎదుర్కొంటాడో..?

Published on Mar 30, 2020 5:27 pm IST

రాజమౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ తో రూపొందిస్తున్న అతిపెద్ద మల్టీ స్టారర్ రౌద్రం రణం రుధిరం పై అంచనాలు పీక్స్ కి చేరాయి. తాజాగా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ మరియు చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలు సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాహుబలి స్థాయిలో. మరో విజువల్ ట్రీట్ ఆర్ ఆర్ ఆర్ రూపంలో ప్రేక్షకులకు ఆయన అందించనున్నాడని అర్థం అవుతుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ లుక్ చరిత్రకు పొంతన లేకుండా సరికొత్తగా ఉంది. ఇక త్వరలో బయటికి రానున్న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సైతం వాస్తవికతకు దూరంగా ఉండే అవకాశం కలదు.

ఈ నేపథ్యంలో సామాజికవాదులు మరియు చారిత్రక నిపుణులు ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కలదు. చరిత్రలో గొప్ప పేరున్న ఇద్దరు వీరుల జీవిత కథను అవాస్తవంగా చూపించడానికి వారు ఇష్టపడరు. కాబట్టి వారు న్యాయస్థానం తలుపు తట్టే అవకాశం కలదు. యథాతధంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయడం రాజమౌళికి సవాలు కానుందని కొందరివాదన.

సంబంధిత సమాచారం :

X
More