సమీక్ష : “రుద్రమాంబపురం” – తెలుగు చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

Rudramambapuram Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: అజయ్ గోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రెడ్డి, ప్రమీల, నండూరి రాము, జనార్ధన్, జెమినీ కిరణ్, వంశీధర్ చాగర్లమూడి, తదితరులు

దర్శకుడు : మహేష్ బంటు

నిర్మాత: నండూరి రాము

సంగీతం: వెంగి

సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి

ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ ఓటిటిలో వచ్చిన మరో చిత్రం “రుద్రమాంబపురం” కూడా ఒకటి. మరి నటుడు అజయ్ ఘోష్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..రుద్రమాంబపురం అనే ప్రాంతంలో శివయ్య (రాజశేఖర్) అనే ఓ మత్స్యకారుడు అలాగే ఆ ప్రాంతంలో పేరుమోసిన వ్యక్తి కూడా కాగా అక్కడే రింగు వలలతో చేపలు పట్టి వ్యాపారం చేసే తిరుపతి(అజయ్ ఘోష్) అనే మరో వ్యక్తితో ఎప్పుడు నుంచో గొడవలు ఉంటాయి. అయితే తిరుపతి కొడుకు శీనయ్య(అర్జున్ రెడ్డి) తనకి ఉన్న పరిచయాలతో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ మెంట్ లో తన తండ్రికి శివయ్యకి ఉన్న గొడవలు సెటిల్ చెయ్యాలని చూస్తాడు. మరి వీరు వాళ్ళ గొడవలు సెటిల్ చేసారా లేదా అసలు వారిద్దరికి ఉన్న గొడవ ఏంటి? అనేది అసలు అంశం.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా ప్రధానంగా కనిపించే నటీనటుల పెర్ఫామెన్స్ లు వారిపై సన్నివేశాలు అని చెప్పాలి. ముఖ్యంగా నటుడు అజయ్ ఘోష్ నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇది వరకు తాను కొన్ని కామెడీ పాత్రలు సహాయ నటుడుగా కనిపించాడు కానీ ఈ చిత్రంలో తన నటన నుంచి సరికొత్త కోణాలు కనిపిస్తాయి.

ఓ తండ్రిగా వ్యాపారం చూసుకునే వాడిగా మంచి ఎమోషన్స్ తో ఇంప్రెసివ్ నటనను అజయ్ ఈ చిత్రంలో కనబరిచి ఆకట్టుకుంటాడు. ఇక మరో నటుడు శివయ్యగా కనిపించిన రాజశేఖర్ కూడా ఓ మత్స్యకారునిగా సహజమైన నటనతో డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇంకా నటుడు అర్జున్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. ఇక వీటితో పాటుగా సినిమాలో పలు ఎమోషన్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో నటుల పెర్ఫామెన్స్ లు పరంగా బాగానే ఉంటుంది వారితో పాటుగా వాటికి అనుగుణంగా సరైన స్క్రీన్ ప్లే నరేషన్ కూడా ఉంటే బాగుండేది. ఇదే సినిమాలో బాగా మైనస్ లా అనిపిస్తుంది. కథనాన్ని కానీ దర్శకుడు ఇంకా ఇంట్రెస్టింగ్ వే లో మలచి ఉన్నట్టు అయితే ఈ సినిమా మరింత బాగుటుంది అనిపిస్తుంది.

ఇక అలాగే సినిమాలో ఫస్టాఫ్ చూసాక సెకండాఫ్ ఇంకా బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. కానీ అనూహ్యంగా సెకండాఫ్ లో ఇది మిస్ అవుతుంది. ఇక వీటితో పాటుగా శీనయ్య పాత్రకి డిజైన్ చేసిన లవ్ స్టోరీ ఇంకా కొన్ని ఇతర సన్నివేశాలను బెటర్ గా చేసి ప్రెజెంట్ చేయాల్సింది.

అలాగే హీరోయిన్ ప్రమీలకి పెద్దగా ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది ఈ చిత్రంలో..వీటితో పాటుగా కొందరు ముఖ్య నటులు మినహా మిగతా నటీనటుల పెర్ఫామెన్స్ లు క్యాస్టింగ్ అంత నాచురల్ గా సినిమాలో అనిపించదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు అని చెప్పొచ్చు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్స్ ఈ చిత్రానికి యావరేజ్ గా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని సీక్వెన్స్ లు ట్రిమ్ చేసి తప్పించాల్సింది. ఇక దర్శకుడు మహేష్ బంటు విషయానికి వస్తే తన వర్క్ కూడా ఇంకా బెటర్ గా చేయాల్సింది. మెయిన్ క్యాస్టింగ్ నుంచి మంచి నటన తాను రాబట్టాడు కానీ ఇంకా బెటర్ గా స్క్రీన్ ప్లే నరేషన్ ని ఇవ్వాల్సింది. అలా చేసి ఉంటే సినిమాకి మరికాస్త బెటర్ ఫీల్ ఇచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రుద్రమాంబపురం” పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. అజయ్ ఘోష్ రాజశేఖర్ అనింగి తదితర నటుల పెర్ఫామెన్స్ తప్ప చిత్రంలో చెప్పుకోదగిన అంశాలు ఏమీ లేవు. దీనితో ఈ చిత్రం ఈ వారాంతానికి బోరింగ్ ట్రీట్ ని ఇస్తుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version