“రుద్రంగి” సెన్సార్ పూర్తి…ఆ సన్నివేశాలు తొలగింపు!


ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో, అజయ్ సామ్రాట్ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రుద్రంగి. ఈ చిత్రం ను జులై 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం సెన్సార్ కట్స్ తర్వాత 142 నిమిషాల నిడివి కలిగి ఉంది. సెన్సార్ బోర్డ్ వారు 8 కట్స్ ను చేయడం జరిగింది. బూతులు ఎక్కువగా ఉన్న చోట్ల మ్యూట్ చేయడం, కొన్ని చోట్ల సిజి ఉపయోగించి కొన్ని బ్లర్ చేయడం జరిగింది. రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గనవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, దివి వదత్య కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version