ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్.. రుక్మిణి సైలెంట్..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్‌లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని.. వీరి కాంబినేషన్ అదిరిపోతుందనే టాక్ సినీ వర్గాల తో పాటు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఇదే విషయాన్ని రుక్మిణి వాసంత్ దగ్గర ప్రస్తావించగా, ఆమె మౌనంగా ఉందని.. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరు మాత్రం చేయరు..అనేలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో, అసలు ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్ నిజంగానే నటిస్తుందా.. లేక వినిపిస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనా.. అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version