బాలయ్య రూలర్ గా విజృంభించాడు. తన శత్రువులను వేట కొడవలితో చీల్చి చండాడాడు. రూలర్ ట్రైలర్ చూసిన ఎవరియాకైనా ఆయన ఈసారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వనున్నాడన్న విషయం అర్థమైపోతుంది. ఇంకా రెండు వారాలలో రూలర్ విడుదల నేపథ్యంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. బాలయ్య మార్కు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ మరియు కామెడీ తో కూడిన రూలర్, ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీగా కనిపిస్తుంది.
ఒకప్పటి పోలీస్, బిజినెస్ మెన్ గా ఎందుకు మారాడు అనేది మూవీలో ప్రధాన మలుపు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 20న రూలర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి