అప్పుడే పవన్ – సురేందర్ కాంబోపై నయా రూమర్స్.!

Published on Sep 16, 2020 8:16 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ కళ్యాణ్ మొత్తం నాలుగు ప్రాజెక్ట్ లను వరుస బెట్టి లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై మాత్రం లైన్ కు తగ్గట్టుగానే ఒక్కో దానిపై ఒక్కో అంచనాలు నెలకొన్నాయి. మొన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ అభిమానులు ఊహించని ప్రాజెక్ట్ గా సురేందర్ రెడ్డి పవన్ తో తన చిత్రం ఉన్నట్టుగా ప్రకటించేసారు. దీనితో ఈ కాంబో పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తన సినిమాలో హీరోను స్టైలిష్ గా ప్రెజెంట్ చేసే సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ అనగానే మంచి హైప్ నమోదు అయ్యింది. అయితే ఇంకా చాలా టైం ఉన్న ఈ చిత్రానికి సంబంధించిఅప్పుడే రూమర్స్ కూడా మొదలయ్యిపోయాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన ఒక స్టార్ హీరోయిన్ ను అందులోను ఇప్పటి వరకు పవన్ తో నటించని ఆమెను పెట్టాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి సురేందర్ రెడ్డి ఎవరిని పవన్ కు జోడిగా ప్లాన్ చేయనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More