‘పుష్ప 3’ పై పుకారు వైరల్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 3 గురించి ఓ పుకారు వైరల్ గా మారింది. పుష్ప-2 సినిమా ఎండింగ్‌ లో మూడో పార్ట్ గురించి ఓ అదిరిపోయే లీడ్ ను దర్శకుడు సుకుమార్ సాలిడ్ గా ప్లాన్ చేశాడని.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్‌కు లీడ్‌గా మారుతుందని ఆ పుకార్ల సారాంశం.

అయితే, ఈ పుకార్ల ప్రచారం పై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ‘పుష్ప-2’ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version